మా ఉత్పత్తులు

ప్రకృతి నుండి స్ఫూర్తి పొంది తయారు చేసిన సహజ మూలికా ఉత్పత్తులు — వానపాముల అభివృద్ధి ద్వారా నేల సారాన్ని పెంచి, రైతుల జీవితాలను మెరుగుపరుస్తాయి.

Weed Cut
సహజ కలుపు నివారణి
ప్రస్తుతం వరి పంటకు | Currently for Paddy
Weed Control

Weed Cut

Weed Cut అనేది ప్రస్తుతం వరి (Paddy) పంటకు తయారు చేసిన అద్భుతమైన సహజ కలుపు నివారణి. వరి నాట్లు వేయడానికి ముందే పొలంలో ఉన్న కలుపు విత్తనాలను మొలకెత్తకుండా చేస్తుంది — కలుపు మొక్కల బెడద 90% వరకు తగ్గుతుంది.

⚠️ ప్రస్తుతం వరి పంటకు (Currently for Paddy) ఈ ఉత్పత్తి ప్రస్తుతం వరి సాగు కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. అన్ని పంటలకు త్వరలో అందుబాటులోకి — పరిశోధన కొనసాగుతోంది!
🪱 వానపాముల అభివృద్ధి — నేల సారం పెరుగుతుంది! Weed Cut వాడటం వల్ల భూమిలో వానపాముల అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది, దీని ద్వారా నేల సారం సహజంగా పెరిగి పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది.
  • కలుపు మొక్కల ఎదుగుదలను 90% వరకు అరికడుతుంది.
  • నేలలోని సారాన్ని కాపాడుతుంది, భూమి ఆరోగ్యం మెరుగవుతుంది.
  • కలుపు తీసే కూలీల ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది.
  • వానపాముల అభివృద్ధి వల్ల నేల సజీవంగా ఉంటుంది.
మోతాదు వివరాల కొరకు నిపుణులను సంప్రదించండి: +91 8803880888 |  +91 9618581815
కొనుగోలు కోసం సంప్రదించండి
Nemato-C
వేరు పురుగుల నిర్మూలన
Root Protection

Nemato-C

వరి వేర్లకు ఆశించే నిమాటోడ్లను (వేరు పురుగులను) సమర్థవంతంగా అరికట్టడానికి Nemato-C ని ఉపయోగిస్తారు. ఇది వేరు వ్యవస్థను బలంగా మారుస్తూ, మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది.

🪱 వానపాముల అభివృద్ధి — నేల సారం పెరుగుతుంది! Nemato-C వాడటం వల్ల నేలలో వానపాముల అభివృద్ధి పెరుగుతుంది. వానపాములు మట్టిని తవ్వి గాలి ప్రవాహం మెరుగుపరచడం వల్ల మొక్కలు పోషకాలను సులభంగా తీసుకుంటాయి.
  • నిమాటోడ్ల దాడి నుండి వేర్లకు సమర్థవంతమైన రక్షణ.
  • మొక్క నేల నుండి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది.
  • మొక్కలు బలంగా, పచ్చగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
  • వానపాముల అభివృద్ధి వల్ల భూమి సజీవ సారవంతంగా ఉంటుంది.
మోతాదు వివరాల కొరకు నిపుణులను సంప్రదించండి: +91 8803880888 |  +91 9618581815
కొనుగోలు కోసం సంప్రదించండి
Growamruthi
సహజ మూలికా ఎరువు
Growth Booster

Growamruthi

Growamruthi అనేది కేవలం మూలికా ఆకులను ఉపయోగించి తయారు చేసిన సహజ ఎరువు. ఇది రసాయన యూరియాకు అద్భుతమైన ప్రత్యామ్నాయం. పంట పూత, పిందె, కాయలు అద్భుతంగా పెరగడానికి సహాయపడుతుంది.

🪱 వానపాముల అభివృద్ధి — నేల సారం పెరుగుతుంది! Growamruthi మూలికా సారాంశం భూమిలో వానపాముల అభివృద్ధిని గణనీయంగా పెంచుతుంది. ఇది నేల సారాన్ని సహజంగా పెంచి, పంట దిగుబడిని 20% వరకు అధికం చేస్తుంది.
  • 100% మూలికా సారాంశం — రసాయనాలు లేవు.
  • రసాయన యూరియా కంటే మెరుగ్గా పనిచేస్తుంది.
  • దిగుబడి 20% వరకు పెరిగే అవకాశం.
  • వానపాముల అభివృద్ధి వల్ల నేల దీర్ఘకాలం సారవంతంగా ఉంటుంది.
మోతాదు వివరాల కొరకు నిపుణులను సంప్రదించండి: +91 8803880888 |  +91 9618581815
కొనుగోలు కోసం సంప్రదించండి

Growamruthi — సమస్య నుండి పరిష్కారం వరకు

ఒక మూలికా ఔషధంతో అన్ని సమస్యలకు పరిష్కారం

సమస్య (Problem)

పొలంలో పంట బాగా ఎదగాలంటే కావలసింది భూసారం, భూమిలో వానపాముల అభివృద్ధి, మొక్క వేగంగా ఎదగడం (పెరుగుదల), పూత పిందె, కాయలు బాగా పెరగడం లాంటి ఎన్నో లక్షణాలు ఉంటేనే రైతు సంతోషంగా ఉండగలడు.

ఆవిష్కరణ (Innovation)

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి గ్రాన్‌రూట్స్ ఇన్నోవేటర్ 'గల్లా చంద్రశేఖర్' తయారు చేసిన "గ్రోఅమృత్" మూలికా పురుగు మందువల్ల భూసారం ఆరోగ్యంగా ఉండేలా చేయటం వల్ల భూమిలో వానపాముల అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది.

ప్రభావం (Impact)

అన్ని సమస్యలను తీర్చే ఒకేఒక 'మూలికా ఔషధం'గా పనిచేసే "గ్రోఅమృత్" మందును రైతులు ఎంతో ఆనందంగా ఉపయోగించుకుంటున్నారు. రసాయన మందులకు వదాల్సిన అవసరం లేకుండా పంటలు సమృద్ధిగా పండుతున్నాయి.

గ్రామీణ ఆవిష్కరణలకు మద్దతునిచ్చే సంస్థలు

గల్లా చంద్రశేఖర్ గారి ఆవిష్కరణలను గుర్తించి, ప్రోత్సహించిన ప్రముఖ సంస్థలు:

Honey Bee Network honeybee.org
SRISTI sristi.org
Palle Srujana pallesrujana.org